పార్లమెంట్​ ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ధి ఎంతంటే..!

-

ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2021 -22 లో జి.డి.పి వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 నో జి.డి.పి వృద్ధి రేటు 8-8.5 శాతం ఉంటుందని లెక్కగట్టింది కేంద్ర ప్రభుత్వం. 2020-21 లో జిడిపి 7.3 శాతం క్షీణించిందని సర్వేలో స్పష్టమైంది.

దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు, జి డి పి అంచనాలను సర్వేలో పొందుపర్చారు ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వర్. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభ ముందుకు తీసుకువచ్చారు. అనంతరం లోక్ సభ వాయిదా పడింది.కాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ముందు రోజు ఈ సర్వేను లోక్సభలో ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆయన బృందం తయారు చేస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ప్రిన్సిపాల్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం సిద్దం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news