నిన్న రాత్రి జరిగిన ఒక ఘటన ఎ ఆర్ రెహమాన్ అభిమానులకు విచారాన్ని కలిగించింది అని చెప్పాలి. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకుడు అయిన రెహమాన్ ప్రపంచం నలువైపులా తన మ్యూజిక్ తో ఎందరినో మంత్ర ముగ్ధులను చేస్తూ ఉంటాడు. అదే విధంగా నిన్న రాత్రి పూణే లో ఒక మ్యూజిక్ షో కు కమిట్ అయిన రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలో సడన్ గా పోలీసులు అక్కడకు వచ్చి షో ను నిలిపివేయాలని ఆదేశించారు.
సుప్రీం కోర్ట్ ఆదేశం ప్రకారం ఈ ఏరియా లో రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఇలాంటి షో లు నిర్వహించాలని… అదనపు సమయానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలపడంతో షో ను ఆపడానికి నిర్వాహకులు సైతం అడ్డు చెప్పలేదు. ఈ విషయాన్ని జోన్ 2 డీజీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు.