TSPSC పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. రంగంలోకి ఈడీ

-

తెలంగాణలో కలకలం రేపిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టబోతోంది. సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సహా పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు వాటిని లీక్‌ చేసి అమ్ముకున్నారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ చేపట్టిన దర్యాప్తులో పలు ఆధారాలు లభించాయి. టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version