ఎడిట్ నోట్: బాబు-సాయి ‘విచిత్ర’ బంధం.!

-

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఈ ఇద్దరు రాజకీయంగా బద్ధశత్రువులు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక సాయిరెడ్డి ట్విట్టర్ లో ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్లని తిడతారో చెప్పాల్సిన పని లేదు. దారుణమైన పదజాలంతో సాయిరెడ్డి విరుచుకుపడుతూ ఉంటారు. ఇక సాయిరెడ్డికి టి‌డి‌పి శ్రేణులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తాయి. అలాగే చంద్రబాబు, లోకేష్‌లు సైతం ఏ2 అంటూ సాయిరెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇలా బాబు-సాయిరెడ్డి మధ్య రాజకీయంగా శతృత్వం ఉంది. అయితే ఫ్యామిలీ పరంగా వారికి బంధుత్వం కూడా ఉండటం..తాజాగా తారకరత్న మరణించడంతో..వారి బంధుత్వం బలపడినట్లు కనిపించింది. నందమూరి తారకరత్న..దివంగత ఎన్టీఆర్ మనవడు..మోహన్ కృష్ణ కుమారుడు. అయితే చంద్రబాబు భార్య భువనేశ్వరి సైతం ఎన్టీఆర్ కుమార్తె అనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే భువనేశ్వరి, మోహన్ కృష్ణ..అన్నా చెల్లెళ్ళు..ఆ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు..తారకరత్నకు మావయ్య అవుతారనే సంగతి తెలిసిందే.

అదే సమయంలో విజయసాయి కూడా తారకరత్నకు వరుసకు మావయ్య అవుతారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తల్లి, విజయసాయి భార్య..అక్కాచెల్లెళ్ళు. అంటే ఆ విధంగా సాయిరెడ్డి తారకరత్నకు మావయ్య అవుతారు. అయితే తారకరత్న అనూహ్యంగా గుండెపోటుతో 23 రోజుల పాటు చికిత్స పొంది..తాజాగా తుదిశ్వాస విడిచారు.

Viral Pics: Vijayasai Reddy with CBN and NTR - TeluguBulletin.com

ఇక ఆయనకు నివాళి అర్పించడానికి సాయిరెడ్డి వచ్చారు. వచ్చి అక్కడే ఎక్కువసేపు ఉన్నారు..సాయిరెడ్డి వరుసగా..ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడారు. కానీ ఏది హైలైట్ అవ్వలేదు గాని..చంద్రబాబుతో సాయిరెడ్డి మాట్లాడటమే పెద్ద హైలైట్ అయింది. రాజకీయంగా శతృత్వం ఉంది..కానీ ఇటు బంధుత్వం ఉండటంతో ఇద్దరు నేతలు పలకరించుకున్నారు. కానీ ఫార్మాలిటీ ప్రకారం ఏ రెండు నిమిషాలో మాట్లాడుకుంటే పరిస్తితి వేరేగా ఉండేది. కానీ దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నారు. అలాగే చంద్రబాబు ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు సాయిరెడ్డి పక్కనే ఉన్నారు. బాబు వెళ్ళేవరకు సాయిరెడ్డి పక్కనే ఉన్నారు.

దీంతో వారిద్దరి భేటీపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో బండ్ల గణేశ్ లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.  “నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం  కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!” అంటూ ట్వీట్ చేశారు.

అంటే బండ్ల..సాయిరెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడినట్లు ఉన్నారు. ఎందుకంటే గతంలో బండ్ల, సాయిరెడ్డిల మధ్య ట్వీట్ వార్ నడిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సాయిరెడ్డిని టార్గెట్ చేసి బండ్ల ట్వీట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి బాబు-సాయిరెడ్డి కలయిక ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news