ఎడిట్ నోట్: జగన్ ‘ముందస్తు’ విజయం..!

-

ముందస్తుకు వెళ్ళి..ముందుగానే విజయం సాధించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారా? ఢిల్లీకి వెళ్ళి..కేంద్ర పెద్దలని ఒప్పించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారా? అంటే అన్నీ మీడియా సంస్థలు అవుననే అంటున్నాయి. ఢిల్లీ రాజకీయ వర్గాలు అదే చెబుతుంది. దీంతో జగన్ ముందస్తుకు వెళ్ళడం ఖాయమనే అంశం నిజం కాబోతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

పైకి వైసీపీ నేతలు మాత్రం ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, ఐదేళ్లు అధికారంలో ఉంటామని అంటున్నారు. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా సంస్థలు అలా చెప్పడం లేదు. జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయ్యారనే చెబుతున్నాయి. దీంతో ముందస్తు ఖాయమని తెలుస్తుంది. ముందస్తుకు వెళితే వైసీపీకి లాభాలు ఎక్కువగానే ఉంటాయి. మొదట వ్యతిరేకత అనుకున్న మేర పెరగదు. ప్రతిపక్షాలు బలపడవు. అలాగే నిధుల కొరత తగ్గుతుంది.

దీని వల్ల వైసీపీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఆ దిశగానే తాజాగా ఢిల్లీకి వెళ్ళి మోదీ, అమిత్ షాలతో మాట్లాడినట్లు సమాచారం. ఆ ఐదు రాష్ట్రాలతో ఏపీ ఎన్నికలు జరిగేలా చర్చ చేసినట్లు తెలిసింది. అలాగే ఎప్పటిలాగానే విభజన హామీల గురించి జగన్ అడిగారు.

అయితే మొదట నుంచి ఏపీలో ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన తెస్తూనే ఉన్నాయి. కానీ వైసీపీ నేతలే వాటిని ఖండిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని అంటున్నారు. కాకపోతే జగన్ ఇంతవరకు ఆ అంశంపై మాట్లాడలేదు. మొత్తానికి ఆయన వ్యూహాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. అదును చూసి ప్రతిపక్షాలని దెబ్బకొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు బలపడకముందే ముందస్తుకు వెళ్ళి విజయం అందుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. చూడాలి మరి జగన్ ముందస్తుకు వెళ్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news