ఎడిట్ నోట్: జగన్ సం’క్షేమం’.!

-

సంక్షేమ పథకాలతోనే జగన్ క్షేమంగా ఒడ్డుకు చేరానున్నారా? సంక్షేమంపైనే ఆధారపడి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి చూస్తున్నారా? అంటే నో డౌట్ సంక్షేమంపైనే ఆధారపడి జగన్ నెక్స్ట్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే మళ్ళీ గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. తాజాగా ఏపీ బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే సంక్షేమ రంగానికే ప్రాధాన్యత ఇచ్చారని పూర్తిగా అయిపోతుంది. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ సంక్షేమ రంగంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.

ఆదాయం సృష్టించే అభివృద్ధిని పెద్దగా పట్టించుకోకపోయినా..జనాల బ్యాంకు ఎకౌంట్ ల్లో నేరుగా డబ్బులు జమ చేయడంపైనే జగన్ ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. అప్పులు చేయడమో..లేక పన్నుల భారం పెంచి ఆదాయం రాబట్టడమో చేసి..ఆ డబ్బులని పథకాల రూపంలో అర్హులైన వారికి అందిస్తున్నారు. పూర్తిగా పథకాల పై పెట్టిన దృష్టి దేనిపైన పెట్టలేదు. ఇప్పుడు అవే పథకాలు తమ గెలుపు మంత్రమని జగన్ భావిస్తున్నారు. తాజాగా బడ్జెట్ లో పెద్ద ఎత్తున పథకాలకు కేటాయింపులు చేశారు.

రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ ను ఆర్దిక మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నవరత్నాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలకు..మహిళలకు సంబంధించిన పథకాలకు నిధులను పెంచారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేసారు.

అసలు బడ్జెట్ లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్కీంలకు రూ 54,228.36 కోట్లను ప్రతిపాదించారు. అందులో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ. 21,434.72 కోట్లను, జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు.. జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసారు.

అమ్మఒడికి రూ రూ.6,500 కోట్లు, వైయ‌స్ఆర్‌ ఆసరాకు రూ.6700, వైఎస్సార్ చేయూతకు రూ 5 వేల కోట్లు, వైఎస్సార్ రైతు భరోసాకు రూ 4,020 కోట్లు కేటాయించారు. అంటే సంక్షేమ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంక్షేమంతోనే ప్రజల మద్ధతు పెంచుకుని మళ్ళీ గెలవాలనేది జగన్ టార్గెట్..మరి ఈ సంక్షేమం జగన్‌ని క్షేమంగా గెలుపు తీరాలకు చేరుస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news