ఎడిట్ నోట్: కేసీఆర్ ‘మ్యాజిక్’..!

-

ఎన్నికల ముందు అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా సరే..ప్రజలపై వరాల జల్లు కురిపించి..మళ్ళీ ప్రజల మద్ధతు పొంది..అధికారంలోకి రావాలని చూస్తూ ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సి‌ఎం కేసీఆర్ మ్యాజిక్ చేయడం మొదలుపెట్టారు. ఈ సారి ప్రతిపక్షాలతో గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో..ప్రజల మద్ధతు పెంచుకోవడం కోసం..తనదైన శైలిలో ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.

ఇప్పటికే కొత్తగా పలు స్కీమ్‌లు తీసుకొచ్చారు. దళితబంధుతో పాటు, బీసీ, మైనారిటీలని ఆకట్టుకునేలా పథకాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చు. అందులో మొదట ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులని…ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఆర్టీసీలో ఇంతవరకు ఉన్న డిమాండ్లు నెరవేరతాయి. అలాగే వారి మద్ధతు బి‌ఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుంది.

అలాగే కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు హైదరాబాద్ మెట్రోని మరింత పొదిగిస్తున్నారు. అలాగే వరంగల్ లో విమానాశ్రయం నిర్మాణానికి 253 ఎకరాలు కేటాయించారు. ఇటు హకీంపేటలో మరో విమానాశ్రయం నిర్మించనున్నారు. ఇటీవల వరదలకు భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ఇస్తున్నారు.

ఇలా కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..ఇవి ఎన్నికలపై బాగానే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో రైతు రుణమాఫీపై కూడా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ చేసే మ్యాజిక్ అని చెప్పవచ్చు. మళ్ళీ ప్రజా మద్ధతు సాధించడం కోసం కే‌సి‌ఆర్ ప్రజలకు వరాలు ఇస్తున్నారు. మరి ఈ వరాలు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎంత మేలు చేస్తాయో చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news