ఎడిట్ నోట్ : మోడీకి ఆ ద‌మ్ము లేద్సార్! ఎందుకో తెలుసా?

-

ఉచిత ప‌థ‌కాల‌కు ఆయ‌న సై అన‌రు
తెలుగు రాష్ట్రాల మాదిరి
అనుచిత రీతిలో ఉచిత ప‌థ‌కాలు ఇవ్వ‌నివ్వ‌రు
ఆ విధంగా మోడీ ద గ్రేట్

అదేవిధంగా రాష్ట్రాలు అప్పులు చేయ‌కూడ‌దు
అనే చెబుతారు
అప్పులు పుట్ట‌క పోతే కేంద్రాన్ని తిట్ట‌డం వ‌ల్ల
వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌నే అంటారు
ఆ విధంగా మోడీ ద గ్రేట్

తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు . రేప‌టి నుంచి ఆ వేడుక ప్రారంభం కానుంది అతి పెద్ద ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. మొత్తం 403 నియోజ‌క‌వ‌ర్గాల‌కు రేప‌టి వేళ యాభైకి పైగా నియోజ‌క‌వ‌ర్గాలలో పోల్ సీన్ జ‌ర‌గ‌నుంది. క‌చ్చితంగా చెప్పాలంటే 58 నియోజ‌క‌వర్గాల‌లో తొలి విడ‌త‌కు సంబంధించి ఎన్నిక‌లు నిర్వ‌హించనున్నారు. ఇందులో 2.27కోట్ల మంది ఓట‌ర్లున్నారు.  623మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 9 మంది మంత్రులు (యోగి ఆదిత్య‌నాథ్ కొలువులో ఉన్న‌వారు) త‌మ అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మూడు ప్ర‌ధాన పార్టీలు అయిన బీజేపీ,కాంగ్రెస్, స‌మాజ్ వాదీ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ల్లో పెద్ద‌గా ఉచిత ప‌థ‌కాలు లేవు. తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే అస్స‌లు అవి ఏమీ కావు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధింంచి మాత్రం ఉచిత విద్యుత్ కు సై అన్నారు బీజేపీ మ‌రియు ఎస్పీ. స‌మాజ్ వాదీ నేత అఖిలేశ్ మ‌రో అడుగు ముందుకు వేసి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ రైతు రుణాల‌ను మాఫీ చేస్తాన‌న్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ బాలికా విద్య‌ను ప్రోత్స‌హించేందుకు కాలేజీకి వెళ్లే యువ‌త‌కు స్కూటీ ఉచితంగా ఇస్తామని పేర్కొంది.

వీరంద‌రి క‌న్నా భిన్న కాంగ్రెస్ పార్టీ నాయక‌త్వం విడుద‌ల చేసిన మ్యానిఫెస్టోలో నిరుద్యోగ యువ‌త ఆశ‌లు తీర్చేలా 20ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయం అని చెబుతోంది. వీటిలో ఎక్క‌డా తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో పోలిస్తే ఉచితాలు అన్న‌వి పెద్ద‌గా క‌నిపించ‌వు. అదేవిధంగా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఉచిత తాయిలాలు ఒక్క‌టే ప్ర‌ధాన బ‌లం అని కూడా న‌మ్మ‌రు. ఇదే త‌ర‌హా ఆలోచ‌నా రీతి మ‌రియు సంబంధిత బ‌లం వైసీపీ పెంచుకుంటే మేలు.

Read more RELATED
Recommended to you

Latest news