ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సేఫ్ గేమ్’..!

-

రాజకీయాల్లో ప్రత్యర్ధులపై దూకుడుగా వెళ్ళి…వారికి చెక్ పెట్టడంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు. ఎలాంటి సమయమలోనైనా డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలోనైనా వెనుకడుగు వేయకుండా తాను అనుకున్నది చేసేస్తారు. అన్నీ పార్టీల కంటే ముందు ఉండేలా కేసీఆర్ రాజకీయం ఉంటుంది. అందుకే ఇన్నేళ్ల పాటు రాజకీయాలని దిగ్విజయంగా నడిపించగలుగుతున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి రెండు సార్లు సీఎం పీఠంలో కూర్చున్నారు.

అయితే రెండు ఎన్నికలోనూ కేసీఆర్ దూకుడుగానే రాజకీయం చేశారు..ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెడుతూ వచ్చారు. ఎన్నడూ కూడా ఒక అంశంలో వెనుకడుగు వేయడం, ఏ సమయంలో ఏం అవుతుందో అని భయపడుతూ, సేఫ్ గా రాజకీయం చేయడం లాంటి చేయలేదు. ఏదైనా డేరింగ్ గానే ముందుకు నడిచారు. కానీ తొలిసారి కేసీఆర్..ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఎప్పుడైనా ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకునే వారు.

కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం మొదలైందో..బీజేపీ పెద్దలంతా తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టారో..అప్పటినుంచి కేసీఆర్ వర్షన్ మారిపోయింది. అసలు ముందు బీజేపీకి చెక్ పెట్టడం కంటే..బీజేపీ తమకు చెక్ పెట్టడకుండా కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగానే కేసీఆర్ సేఫ్ గేమ్ మొదలైంది.

ఎప్పుడైనా తనకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే కేసీఆర్…హుజూరాబాద్‌లో గెలవడం కష్టమనే డౌట్‌తో దళితబంధు తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి బీజేపీ టార్గెట్ సెట్ చేయడం..ఆ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ కొత్త గేమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణని టార్గెట్ చేయడంతో..కేసీఆర్ ఏకంగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అలాగే ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాటికి తగ్గట్టుగా కేసీఆర్ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తే…తాము కూడా ఘనంగా నిర్వహిస్తామని కేసీఆర్ కొత్తగా కార్యక్రమాలు చేశారు.

ఇక ఒకప్పుడు సెప్టెంబరు 17 రోజు అధికారికంగా జాతీయ పతాకం ఎగరేయాలని ప్రతిపక్షాలు అడిగితే.. చిల్లర రాజకీయాలంటూ కొట్టిపడేసిన కేసీఆర్ ఇప్పుడు తానే ఆ అజెండాలోకి రాక తప్పలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతోనే కేసీఆర్‌ కూడా ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంటే ఎక్కడకక్కడ బీజేపీ టార్గెట్ సెట్ చేయడం..ఆ టార్గెట్‌లోనే కేసీఆర్ పనిచేయడం జరుగుతున్నాయి.

కేసీఆర్ అంటూ సెపరేట్‌గా రాజకీయం చేసే పరిస్తితి కనిపించడం లేదు. బీజేపీ ఎలా చేస్తే అలాగే ముందుకెళుతున్నారు..అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టాలని విపక్ష పార్టీల నేతలని వరుసపెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే. అంటే కేంద్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా విపక్ష నేతల మద్ధతు తీసుకుంటున్నారనే డౌట్ కూడా వస్తుంది. మొత్తానికి తెలంగాణ ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత కొన్నాళ్ల వరకూ కేసీఆర్ సెట్‌ చేసిందే రాజకీయ పార్టీలన్నింటికీ అజెండాగా ఉండేది. అలాటిది కేసీఆర్‌కు అనివార్య పరిస్థితుల్లో బీజేపీ అజెండాలోకి వెళ్లి.. వాటిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news