ఎడిట్ నోట్: విశాఖ ‘సెంటర్’ పాలిటిక్స్.!

-

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి..అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఇక ఇటీవల విశాఖ సెంట్రిక్‌గా రాజకీయం రంజుగా సాగుతుంది. ప్రధాన పార్టీలు ఇక్కడే ఫోకస్ చేసి రాజకీయం నడిపిస్తున్నాయి. ఇక త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలన మొదలుపెడతానని చెప్పిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విశాఖలో కాపురం పెడతానని జగన్ చెప్పేశారు.

ఇక విశాఖ పరిపాలన రాజధాని కానుంది. దీని ద్వారా ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్దిపొందాలనేది వైసీపీ టార్గెట్ గా ఉంది. ఇదే సమయంలో రిషికొండని తవ్వేసి అక్కడ కడుతున్న ప్రభుత్వ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. పర్యావరణానికి హాని కలిగించేలా అనుమతులు ఉల్లంఘిస్తూ..కొండపై జగన్ ప్యాలెస్ కట్టుకుంటున్నారని టి‌డి‌పి, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆ మధ్య చంద్రబాబు, ఇటీవల పవన్ రిషికొండపై నిర్మాణాలు పరిశీలించి..అవి అక్రమంగా కడుతున్నారని ఫైర్ అవుతున్నారు.

jagan chandrababu pawan

ఇక దీనిపై వైసీపీ వివరణ ఇస్తూ..మొదట సచివాలయ భవనాలు కడుతున్నారని చెప్పి..తర్వాత పర్యాటక భవనాలు కడుతున్నారని చెప్పుకొచ్చింది. అయితే అక్కడ పర్యాటక రంగానికి సంబంధించి..ఏ ఇతర భవనాలు కట్టడానికి అనుమతి లేదు. పైగా కొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కోర్టులకు కూడా వెళ్లారు. ఇదే క్రమంలో కొండపై గ్రీన్ మ్యాట్ కూడా కప్పారు.

ఇలా అన్నీ రకాలుగా విశాఖలో రాజకీయం రగులుతుంది. ఓ వైపు విశాఖలోనే పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖలోనే నిర్వహిస్తున్నారు. దీంతో విశాఖ సెంటర్ గా రాజకీయం హాట్‌గా సాగుతుంది. అంటే అక్కడ రాజకీయంగా పైచేయి సాధించడానికి వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయి. అయితే జగన్ అక్కడ నుంచి పాలన మొదలుపెడితే పరిస్తితులు ఇంకా మారిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత విశాఖ ప్రజలు ఎవరికి మద్ధతు ఇస్తారు..ఉత్తరాంధ్రలో ఎవరికి ఆధిక్యం వస్తుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news