ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే వడ్డీ రేట్లు ఇక్కడే తక్కువ..!

-

డబ్బులు లేని సమయంలో మనకు మొదట గుర్తు వచ్చేది లోన్. పెర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇలా వుంటుంటాయి. విదేశాలకు వెళ్లేందుకు కూడా లోన్ ఆప్షన్స్ వున్నాయి. పైగా ఈ కాలంలో రుణాలు తీసుకోవడం మరెంత ఈజీ అయ్యింది.

వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి. పైగా లోన్ విషయంలో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా కొన్ని బ్యాంకుల్లో ఉండదు. మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలి అని అనుకుంటే ముందే లోన్ కి సంబంధించి వివరాలను చూసుకోండి. అప్పుడే లోన్ తీసుకోండి. అయితే చాలా మంది చదువుకునే వారు ఎడ్యుకేషన్ లోన్ ని తీసుకుంటూ వుంటారు.

ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు మొత్తం వివరాలను తెలుసుకోవాలి. మీరు లోన్ కి సంబందించిన విషయాలను బ్యాంక్ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి తెలుసుకోవాలి. లేదంటే నేరుగా బ్రాంచ్ కి వెళ్లి తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఎడ్యుకేషనల్ లోన్ గురించి చూస్తే.. 7.95 నుండి 11.15 శాతానికి ఇస్తోంది. ఇది ఇలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 8.45 నుండి 10.75 శాతానికి ఇవ్వగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.65 నుండి 11.40 శాతానికి ఎడ్యుకేషన్ లోన్ ని ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news