నిన్న అధిష్టానం నిర్వహించిన కాబినెట్ భేటీలో తెలంగాణాలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండిని తొలగించి ఆ బాద్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. కాగా అధికార పార్టీ నుండి వచ్చి ఇక్కడ హుజురాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ముందుగా అధిష్టానం నాపిల్ నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుకున్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ పాలన పట్ల ప్రజలు తీవ్రంగా విసిగిపోయి ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని ఎంతో నమ్మకంగా అన్నారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని ఈటల అన్నారు.
ఇంకా ఈయన మాట్లాడుతూ కేసీఆర్ గురించి లోపల బయట అన్ని విషయాలు నాకు తెలుసని కాబట్టి BRS ను ఓడించి, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానన్నారు.