లైంగిక సంబంధం లేకుండానే గర్భందాల్చిన బాలిక.. అసలు విషయం తెలిసి షాకైన తల్లి

-

గర్భందాల్చాలంటే కచ్చితంగా లైంగిక సంబంధం ఉండాలి లేదా సరోగస ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఇవి రెండు జరగకకుండా ఓ యువతి గర్భందాల్చింది. పాపం ఆమె ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు, నమ్మలేదు. కానీ చివరకి అసలు నిజం తెలిసి అంతా షాక్‌ అయ్యారు. డాక్టర్స్‌ సైతం బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే..

బ్రిటన్‌లోని ఓ అమ్మాయి అలసట, వెన్నునొప్పితో బాధపడుతుంది. ఆమె శరీరంలో కూడా కాస్త మార్పులు వచ్చాయి. దగ్గర్లోని డాక్టర్ వద్దకు తీసుకెళితే గర్భం అని చెప్పారట. తనకు ఎవరితోనూ శారీరక సంబంధాలు లేవని పదే పదే చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మలేదు. అయితే ఎట్టకేలకు నిజం బయటకు రావడంతో ఆమె తల్లితో పాటు అందరూ షాక్ అయ్యారు.

బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల హాలీకి 2019లో తనకు అకస్మాత్తుగా వెన్ను నొప్పి రావడం స్టాట్‌ అయింది. స్థానిక వైద్యుడు సయాటికా అని చెప్పారు. కానీ ఆ సమయంలో బరువు చాలా వేగంగా తగ్గుతోందని చెప్పింది. దీంతో తీవ్రమైన తలనొప్పి, అలసట సమస్య మొదలైంది. ఏదైనా పని చేసి అలసిపోతున్నాను. బలహీనత కారణంగా మరుగుదొడ్డికి వెళ్లడం కూడా కష్టమైంది. ఆమెకు మంచం మీద పడుకున్నప్పుడు భరించలేని నొప్పి కూడా కలిగేదట. దీంతో ఆమె తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్ గర్భవతి అని చెప్పారు. ఇది విన్న తల్లితో పాటు ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

పరీక్షా రిపోర్టు చూసిన డాక్టర్ హాలీ గర్భవతి అని స్పష్టంగా చెప్పారు. కానీ హాలీ అందుకు అస్సలు అంగీకరించలేదు. ఏ వ్యక్తితోనూ లైంగిక సంబంధం లేకుండా తాను గర్భం దాల్చలేనని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆమె చాలాసార్లు చెప్పినా డాక్టర్ వినలేదు. ఆ కష్ట సమయంలో తన తల్లి ఒక్కటే తనను నమ్మిందట. తల్లి మళ్లీ డాక్టర్‌ని సోనోగ్రఫీ గురించి అడిగింది. హాలీకి మళ్లీ సోనోగ్రఫీ చేయించారు. అయితే ఈసారి వచ్చిన రిపోర్ట్ చూసి డాక్టర్లతో పాటు అందరూ షాక్ అయ్యారు.

హాలీ గర్భవతి కాదు. ఆమెకు అండాశయ క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పలు పరీక్షలు చేశారు. ఆమె ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులలో 42 క్యాన్సర్ కణితులు ఉన్నాయట. క్యాన్సర్ నాల్గవ దశకు చేరుకుంది. ఇది విన్న ఆమె తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. హాలీకి చికిత్స అందించారు. డాక్టర్ సర్జరీ చేసి అండాశయాన్ని తొలగించారు. కీమోథెరపీ చికిత్స కూడా చేశారు. ఇప్పుడు, హాలీ పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే డ్రగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి.

మనందరికీ తెలుసు.. క్యాన్సర్‌ను కొన్ని సందర్భాల్లో ముందుగా గుర్తించలేము. అది బాగా ముదిరితే కానీ మనకు తెలుస్తుంది. అందుకే సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఫుల్‌ బాడీ చెక్‌ప్‌ చేయించుకోవాలి. డబ్బులు కోసం ఆలోచించి ఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకోవడం చెప్పండి..

Read more RELATED
Recommended to you

Latest news