తెలంగాణాలో అధికార BRS పార్టీ అన్ని రాజకీయ పార్టీల లాగే ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలను ఇచ్చింది. ఇక వాటిని నెరవేర్చే ప్రక్రియలో కొంతవరకు సఫలం అయినా , చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయన్నది ప్రతిపక్షాల వాదన. అందులో భాగంగానే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచి విద్యుత్తు పై చాలా కాలంగా అధికార పార్టీ కాన్ఫిడెంట్ గా వాదిస్తూ వస్తోంది. ఇక ఈ విషయంపై అటు కాంగ్రెస్ మరియు బీజేపీలు నిరూపించండి చూద్దాం అంటూ అడిగినా సమాధానం లేదు. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇదే అంశంపై తన వాణి వినిపించారు. ఈ రాష్ట్రంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే నా ముక్కును నేలకు రాసి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఈటల రాజేందర్ బహిరంగ సవాల్ విసిరారు. ఎవరిస్తారో చర్చకు రండి అంటూ అధికార పార్టీని అడిగారు రాజేందర్.
ఈ విషయంలో నిరూపించకపోతే ఇకనైనా తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు ఈటల. మరి ఎవరైనా ప్రభుత్వం తరపున ఈ విషయంలో ముందుకు వచ్చి నిరూపిస్తారా లేదా ఆనంది చూడాలి.