గుడ్డులోని ప‌చ్చసొనను తిన‌నివారు ఇది చ‌ద‌వండి.. ఈ విష‌యాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

-

గుడ్డు తినండి..ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెబుతుంటారు. గుడ్డు అంటే ఇష్టంలేని వాళ్లు కూడా ఈ మహమ్మారి దెబ్బకు కనీసం రోజుకు ఒక గుడ్డైనా తింటున్నారు. అయితే చాలామందికి గుడ్డు తినటంలో కూడా మస్త్ షేడ్స్ ఉంటాయిలే..కొందరు ఉడికించిన గుడ్డులో వైట్ ది తిని..పచ్చది వదిలేస్తారు. కొంతమంది..లోపలి పార్ట్ తిని బయటది వదిలేస్తారు. అసలు గుడ్డు ఎందుకు తింటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి..అలాంటప్పుడు మొత్తం తినాలి కదా..మళ్లీ అందోలో ఈ డిఫ్రన్స్ ఏంటో.

అయితే గుడ్డులో పచ్చని సొన తినకపోవడానికి మీకు ఉండే కారణాలు..ప‌సుపు రంగు పార్ట్ తిన‌డం వ‌ల‌న బాడిలో ఫ్యాట్ వ‌స్తుంద‌ని
శ‌రిరంలో కొవ్వు పెర్కొని గుండెపోటు కూడా వ‌స్తుంద‌ని భావిస్తారు. ఇంకా కొందరైతే గ్యాస్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది ఫీల్ అవుతారు.
అయితే నిజానికి.. కొలెస్ట్రాలు కూడా ఉంటుంది . ప‌చ్చసొనలో కొలెస్ట్రాలు 185 గ్రాములు వ‌ర‌కు ఉంటుంది . అందువ‌ల‌నే ఈ ప‌సుపు సొన భాగంలో కొలెస్ట్రాలు అధికంగా ఉండ‌టం వ‌ల‌న దీనిని తిన‌డానికి ఇష్టపడరు.

ప‌చ్చ‌సొనలో అధికంగా క్యాల‌రీలు ఉంటాయి. పచ్చసొనలో.. 55 క్యాల‌రీలు ఉండగా.. తెల్ల సొనలో 17 క్యాల‌రీలు ఉంటాయి . క్యాల‌రీలు అధికంగా ఉన్న ప‌చ్చ‌ సొన తిన‌డం వ‌ల‌న శ‌రీరంలో ఫ్యాట్ పెరుకు పోతుందని దీనిని తిన‌డం మానేస్తారు. కొలెస్ట్రాలు గురించి మాట్లాడితే ..నిజానికి ప‌చ్చ సొన‌లో ఉండే కొలెస్ట్రాల్ హ‌నిక‌రం కాదు. గుడ్డులోని ప‌చ్చసొనలో చాలా పోష‌కాలు ఉంటాయి. అంతే కాదు ఇది మ‌న ఆరోగ్యానికి చాలా అవ‌స‌రం.

గుడ్డులోని ప‌చ్చ సొన‌లో విట‌మిన్ – ఎ,ఈ,డి,కె ,ఒమేగా -3 కొవ్వులు ఉంటాయి. ఫోలేట్ ,విట‌మిన్ -బి12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే ప‌సుపు భాగంలోనే ఎక్కువ‌గా ఉంటుంది. ప‌చ్చ సొన‌లో ఐర‌న్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అంటే ఏదో నామ్ కే వాస్తే అన్నట్లు..గుడ్లో పచ్చసొన వదిలేసి తినేవాళ్లు..అసలైంది వదిలేసి స్క్రాప్ ని తిన్నట్లే..కాబట్టి గుడ్డు తినాలంటే..మీరు కచ్చితంగా రెండు తినాలి..మీకు మరీ అంతగా నచ్చదంటే..ఆఫ్ బాయిల్ చేసుకుని..లైట్ గా ఉప్పుకారం వేసుకుని తింటే..టేస్ట్ అదిరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news