టాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్నారా ?.. హోమ్ రెమిడీస్‌తో ఇలా సులభంగా చెక్ పెట్టండి..

-

ఈ ఏడాది చలి చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లే..ఈ చలివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇమ్యునిటీ పవర్ తక్కువ ఉన్నవాళ్లు, అస్తమానం జలుబు , దగ్గు భారిన పడే వాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. చలికారణంగా..కొంతమందికి గొంతులో ఇన్ఫెక్షన్ తలెత్తుంది. గొంతులో ఉండే గ్రంథులనే టాన్సిల్స్ అంటారు. వీటి పనేంటంటే..శీరీరాన్ని బయటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటం..తీవ్రమైన బ్యాక్టీరియా. వైరస్ కారణంగా..ఈ టాన్సిల్స్ కు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇక ఉంటుంది నొప్పి..అబ్బో మామూలుగా ఉండదుగా..ఏది తినలేరు, తాగలేరు. ఎక్కువగా చిన్నపిల్లలే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడతారు.

దవడ కింది భాగంలో వాచి.., చెవి కింద భాగంలో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, బలహీనత వంటివి కూడా టాన్సిల్స్ లక్షణాలే. ఈ సమస్య ఏర్పడినట్లయితే.. డాక్టర్‌ను సంప్రదించి వెంటనే చికిత్స పొందటం ఒక మార్గం..చాలా వరకు ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. మరి అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పుతో పుక్కిలించడం..

గొంతు, నోటి లోపల అనేక సమస్యలను తొలగించడానికి ఇది చాలా మంచి పద్ధతి..గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఉప్పునీటితో రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించాలి. ఇలా చేయడం ద్వారా నోటిలోని క్రిములు బయటకు వెళ్లిపోవడం, నశించడం జరుగుతుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు కూడా ఇలా చేయటం వల్ల మంచి ఫలింత ఉంటుంది.

తేనె..

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి . ఇది వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. గొంతులో ఉపశమనం కోసం దీనిని రెండు విధాలుగా తీసుకోవచ్చు. పాలలో కలిపి తాగొచ్చు, గోరు వెచ్చని నీటిలో పసుపు, తేనె కలుపుకుని తాగొచ్చు.

క్యారెట్ రసం..

క్యారెట్‌లోనూ అనేక యాంటీ-టాక్సిన్‌లు ఉన్నాయి. ఇవి టాన్సిల్స్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది..ఈ రసం తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పుదీనా టీ..

పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి..పుదీనా టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితే టాన్సిల్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.

పసుపు పాలు..

పసుపు వేసిన పాలు ఎంత ఆరోగ్యమో మనకు బాగా తెలుసు.. పాలు కూడా టాన్సిల్స్‌కి దివ్యౌషధం లా పని చేస్తాయి. మరుగుతున్న పాలలో పసుపు కలపాలి. పడుకునే ముందు మాత్రమే పసుపు పాలు తాగాలి. ఇది టాన్సిల్స్ వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే..వీటిలో ఏదైనా మీకు సులభంగా ఉన్నది ట్రై చేయండి. సమస్య తీవ్రతను బట్టి వైద్యుడ్ని సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news