ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యే బూత్ లెవెల్ ఆఫీసర్ల వేతనాన్ని ఎన్నికల కమిషన్ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందులో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, BLO సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కూడిన ఓటర్ల జాబితా యంత్రాంగం చాలా కష్టపడి పనిచేస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది.
అందువల్ల,BLOS కోసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఓటర్ల జాబితాల తయారీ సవరణలో పాల్గొన్న BLO సూపర్వైజర్ల వేతనాన్ని కూడా పెంచింది. చివరిసారిగా ఇటువంటి సవరణలో 2015లో జరిగింది. అలాగే, మొదటిసారిగా EROS,AEROS లకు గౌరవ వేతనం అందించబడుతుందని ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజాగా కమిషన్ పెంచిన జీతాల వివరాలు కింద చూడవచ్చు.