ఈ నెల 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక..?

-

ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తం దాదాపు 10 రోజుల పాటు సాగే ఈ సెషన్ లో తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. అలాగే ఈనెల 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్నట్టు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ-జేడీయూ స్పీకర్ పదవీ కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే చర్యలు సాగుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నీట్ లీకేజీపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఈనెల 26న స్పీకర్ పదవీ ఏ పార్టీని వరిస్తుందోననే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version