వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజగా ఓ అడుగు ముందుకేసి ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాయి. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో.. దశలవారీగా ఉద్యోగులను కంపెనీలకు రావాలాని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కొన్ని రోజులు ఇంటినుంచి.. మరికొన్ని రోజులు ఆఫీస్ నుంచి పని చేసే విధానం తీసుకువచ్చేలా హైబ్రిడ్ విధానం పుట్టుకొచ్చింది.
ఎంతో మంది కార్మికులు పని ప్రదేశాల్లో కష్టపడుతున్నారని, కార్ల తయారీ, వాహన సర్వీసింగ్, భవన నిర్మాణ కార్మికులు, వంట మనుషులు వీరితో పాటు వివిధ రంగాల్లో ఉన్న వారు తమ పనులను యథావిధిగా చేసుకుంటుంటే మరి కొంత మంది వర్క్ ఫ్రమ్ హోం లో ఉంటున్నారని ఇలా చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని చూసి మరో రకంగా అనుకునే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్పాదకతకు సంబంధించిన విషయం మాత్రమే కాదని ఇది నైతిక పరమైన విషయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానం వల్ల ఆశించినంత ఉత్పాదకత సాధించలేమని ఈ సందర్భంగా టెస్లా ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్లా ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలైనా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని ఆదేశించారు.