తెలంగాణ టీచింగ్ గవర్నమెంటు డాక్టర్స్ అసోషియేషన్ అత్యవసరంగా సమావేశం అయ్యారు.సోమవారం నుండి అన్ని మెడికల్ కాలేజీల్లో బ్లాక్ బాడ్జెస్ తో నిరసన తెలుపనున్నట్లు వారు తెలిపారు.అన్ని మెడికల్ కాలేజీల్లోని టిటిజిడిఏ యూనిట్లు, పెండింగ్ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.మా హక్కుల కోసం మరియు ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు.కోవిడ్ సమయంలో ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రజలందరూ ప్రశంసించారని అన్నారు.త్వరలోనే DME ని కలిసి అన్ని సమస్యలు మళ్లీ విన్నవిస్తామని అన్నారు.
పూర్తి స్థాయి యూజిసి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.జనరల్ ట్రాన్స్ ఫర్స్ కూడా చేయడం లేదన్నారు.56 నెలల PRC బకాయిలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.EL ఎన్ క్యాష్మెంటు ఇవ్వడం లేదన్నారు.చాలా హాస్పిటల్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదనీ,సాలరీలు మొదటి తారీకున కూడా రావడం లేదన్నారు.చాలా మంది డాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్నారని తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాలు తీవ్రతరం అవుతాయని అన్నారు.