జగన్ కు బిగ్ షాక్.. రేపు సమ్మె నోటీసులు ఇవ్వనున్న ఉద్యోగులు

-

రేపు సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తున్నామని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు ప్రకటన చేశారు. రెండు రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని… ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీ పై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని.. ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదు… మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని పేర్కొననారు. పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలి కానీ ఇలా మోసం చేస్తారా? కేంద్రం ఇచ్చే స్కేల్స్ కు మాకు సంబంధం ఉండదని వెల్లడించారు.

ప్రజల సంక్షేమం కోసం ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? ఎప్పుడు పీఆర్సీ ఇవ్వాల్సి వచ్చినా ప్రభుత్వాలు ఆదాయం లేదనే చెబుతుంటాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్ధిక లోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు.. ఎమ్.పీ. అబద్ధాలు చెప్పారా ? అని మండిపడ్డారు. 23 శాతం ఫిట్ మెంట్ కు కొన్ని సంఘాలు పాలాభిషేకాలు, పూజాభిషేకాలు చేశాయని.. మా ఆర్ధిక పరిస్థితిని కూడా ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news