కేసీఆర్ సర్కార్ పిలిస్తే కచ్చితంగా పోతా – ఈటల సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ సర్కార్ పై ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పిలిచినా బీఆర్ఎస్ లోకి పోనని పేర్కొన్న ఈటల రాజేందర్‌.. ప్రజల సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వం పిలిస్తే కచ్చితంగా పోతానని తెలిపారు.

ఈటల రాజేందర్ కేసీఆర్ మెతక మాటలకు పడిపోడని… 2004లో కూడా వైఎస్ తో కలుస్తారని ఆపరేషన్ ఆకర్ష్ లో ఉన్నానన్నారు ఆనాడు పోలేదు ఇవ్వాళకూడా పోనని వెల్లడించారు.

నాపై కేసీఆర్ చేసిన దాడి,ఖర్చు,పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదని… పలకరించుకుంటే,పక్కన కూర్చుంటే పార్టీలు మారనని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ కాడని… నేను బీఆర్ఎస్ పార్టీ వీడలేదు, వాళ్లే నన్ను బయటకు పంపారని ఆగ్రహించారు ఈటల రాజేందర్.

 

Read more RELATED
Recommended to you

Latest news