ఈటల రాజేందర్ కు మంద కృష్ణ, ఆర్.కృష్ణయ్య మద్దతు ?

ఎంఆర్పీఎస్ పార్టీ అధినేత మంద కృష్ణ మరియు బీసీ సామాజిక వర్గం జాతీయ నాయకులు ఆర్.కృష్ణయ్య తో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఇద్దరు కీలక నేతలతో వేరు వేరుగా భేటీ అయ్యారు మాజీ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్. హైదరాబాద్ మహా నగరం లోని విద్య నగర్ లో ఆర్. కృష్ణయ్య తో ఈటెల రాజేందర్ మొదటగా భేటీ అయ్యారు.

etala
etala

ఆ తర్వాత ఎంఆర్పీఎస్ పార్టీ అధినేత మంద కృష్ణ తో భేటీ అయ్యారు ఈటెల రాజేందర్. వరుసగా కుల సంఘాల నేతల తో భేటీ అవుతున్న ఈటెల రాజేందర్… టిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా అందరిని ఒకేతాటి పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు హుజూరాబాద్ నియోజక వర్గం లో జరిగే ఉప ఎన్నికలో తనకు మద్దతు తెలపాలని మంద కృష్ణ మరియు ఆర్.కృష్ణయ్య ఈటెల రాజేందర్ కోరినట్లు సంచారం అందుతోంది. అయితే దీనిపై వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.