కరోనా కల్లోలం : ఐదో టెస్టు మ్యాచ్ మొదటిరోజు రద్దు

మాంచెస్టర్ వేదికగా ఇవాళ ఇంగ్లాండ్ మరియు టీమ్ ఇండియా జట్ల మధ్య చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట రద్దయింది. ఐదో టెస్టు తొలి రోజు ఆట రద్దుకు టీమిండియా మరియు ఇంగ్లాండ్ జట్ల బోర్డులు సైతం అంగీకారం తెలిపాయి. దీంతో తొలి రోజు మ్యాచ్ పూర్తిగా రద్దయింది.

రేపు మరిన్ని కరోనా టెస్టులు చేసి ఫలితాలు విశ్లేషించిన తర్వాత మ్యాచ్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటన చేశారు. ఒకవేళ రేపటి కరోనా పరీక్షల్లో.. ఆటగాళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయితే.. టెస్ట్ మ్యాచ్ పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే టీమిండియా జట్టు హెడ్ కోచ్ అయిన… రవి శాస్త్రి మరియు సహాయక సిబ్బంది లో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్ ను రద్దు చేసినట్లు నిర్ణయం తీసుకున్నారు.