మిస్టర్‌ కేసీఆర్‌… తెలంగాణ నీ అబ్బా జాగీరు కాదు : ఈటల

మిస్టర్ సీఎం కేసీఆర్‌…. తెలంగాణ రాష్ట్రం నీ అబ్బ జాగీరు కాదని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలోని వీణవంక మండలం లో ఈటల రాజేందర్‌ ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి.. తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ లో ఎంట్రీ దొరికిందని చురకలు అంటించారు. కౌశిక్‌ రెడ్డికి త్వరలోనే పదవి కూడా రాబోతుందని… ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. తాను ఏం పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. బీజేపీ పార్టీ లో ఉన్న వారికి దళిత బందు ఇవ్వ బోమని అంటున్నారని…. ఎలా ఇవ్వరో తాను చూస్తానని సవాల్‌ విసిరారు. తనకు అన్నం పెట్టే వారు, కారు డ్రైవర్ ను కూడా లేకుండా చేస్తారటర అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్‌.