సైలెంట్‌గా ఈటల జమున…గులాబీ వ్యూహానికి బ్రేక్?

-

ఏమైనా హుజూరాబాద్ విషయంలో అధికార పార్టీ తాను అనుకున్నదే సాధించింది. ఎలాగైనా హుజూరాబాద్ ఉపఎన్నికని వాయిదా వేయించుకోగలిగింది. ఉపఎన్నిక వాయిదా పడితే హుజూరాబాద్‌లో ప్రజలు కాస్త… ఈటలకు మద్ధతు ఇవ్వడం తగ్గుతుందని, ఆయనపై సానుభూతి తగ్గి టి‌ఆర్‌ఎస్‌కు బెనిఫిట్ అవుతుందని భావించారు. అయితే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ అనుకున్నట్లుగానే పరిస్తితులు ఉన్నాయా? అంటే అసలు లేవనే చెప్పొచ్చు.

etela jamuna

మొన్నటివరకు హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్-ఈటల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొంది అనేది అందరికీ తెలుసు. ఈటలని ఓడించడానికి అధికార పార్టీ వేయని ఎత్తుగడ లేదు. హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. కే‌సి‌ఆర్‌తో అధికార పార్టీ నేతలు హుజూరాబాద్‌పై రాజకీయం చేశారు. కానీ ఈటల బలం కాస్త కూడా తగ్గించలేకపోయారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఏం చేసిన అది ఈటల రాజీనామా చేయడం వల్లే చేస్తున్నారని ప్రజలు భావించారు.

ఇక ఇలా అని కాదు చెప్పి ఉపఎన్నికనే వాయిదా పడేలా చేశారు. అప్పుడు ప్రజలు ఈటలని మరిచిపోతారని అనుకున్నారు. కానీ ఫీల్డ్‌లో మాత్రం అలా జరగడం లేదు. ఇంకా ప్రజలు H పట్ల అభిమానంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఈటల ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు. ఇక ఈటలకు మద్ధతుగా ఆయన భార్య జమున సైతం, సైలెంట్‌గా హుజూరాబాద్‌లో ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రజలని కలుస్తూ, వారి మద్ధతు తీసుకుంటున్నారు.

అయితే ప్రజలు సైతం జమునని ప్రచారంలో తిరగొద్దని చెబుతూనే…ఈటలకు తాము అండగా ఉంటామని ఏం ఇబ్బంది పడొద్దని ప్రజలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల గానీ, ఈటల ఫ్యామిలీ గానీ ప్రచారానికి వస్తుంటే ప్రతి ఒక్కరూ బయటకొచ్చి మద్ధతు తెలుపుతున్నారు. అంటే ఈటలని హుజూరాబాద్ ప్రజలు మరిచిపోవడం కష్టమని చెప్పొచ్చు. అంటే ఇక్కడ టి‌ఆర్‌ఎస్ వ్యూహాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news