నాపై దాడి చేస్తే హుజూరాబాద్ అగ్ని గుండం అవుతుంది : ఈటెల

-

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ ఎన్నికల శంఖారావం మొదలైంది. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…నా పైన టీఆర్ ఎస్ దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని అన్నారు. జరిగే పరిణామాలకు సీఎం బాధ్యత తీసుకోవాలని ఈటెల వార్నింగ్ ఇచ్చారు.

cm kcr etela rajender

టీఆర్ ఎస్ హుజూరాబాద్ లో గెలిచేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తోందని ఈటెల అన్నారు. సీఎం కు నిజాయితీ ఉంటే ధర్మాంగా కొట్లాడాలని అన్నారు. టీఆర్ ఎస్ కు డిపాజిట్ కూడా రాదని…సీఎం నమ్ముకుంది కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యం అంటూ ఈటెల ఫైర్ అయ్యారు. అబద్ధాలను ప్రచారంలో చేయడంలో టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ను మించిపోయారు అంటూ ఈటెల సంచలన ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version