హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపొందిన ఈటెల రాజేందర్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ సమక్షంలో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. అసెంబ్లీలో తన ఛాంబర్ లో స్పీకర్, పదవీ స్వీకారం చేయించారు.
పదవీ స్వీకారం తరువాత ఈటెల పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని హామీ ఇస్తున్నా.. హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే అన్నారు. అన్నారు. అసెంబ్లీలో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు అసలు గౌరవమే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాస్తైనా గౌరవం లభించేదన్నారు ఈటెల. అసెంబ్లీలో నా రాజీనామా పత్రం లేకుండా చూశారు.. నన్నే కాదు, రాజ్యాంగాన్ని కూడా అవమాన పరుస్తున్నారన్నారు ఈటెల. కేసీఆర్ ఎంత గొంతు చించుకున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు. నిజమైన ఉద్యమకారుల నోట్లో టీఆర్ఎస్ పార్టీ మట్టికొడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా నిజమైన ఉద్యమకారులు కేసీఆర్ వెంట ఉండవద్దని సూచించారు.