రాజమౌళి దర్శకత్వంలో నటించినా సరే.. కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్..!!

-

సాధారణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీలో రాణించడం అంటే మాటలు కాదు.. ఎంతో కష్టపడాలి.. ఎన్ని ఛాన్సులు వచ్చినా తమ పాత్రకు, కథకు అనుగుణంగా సినిమా కథలను ఎంచుకుంటూ వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలి అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడంతో పాటు టాలెంటు అలాగే కాసింత అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించినా సరే కొంతమందికి పాపులారిటీ ఏమాత్రం లభించదు. ఇక అలాంటి వారిలో రుతిక కూడా ఒకరు. తను సిక్స్ టీన్స్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయి.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో కూడా నటించింది.

ఇక అంతకుముందు సరదా సరదాగా అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత బ్లేడు బాబ్జి , జాన్ అప్పారావు 40 ప్లస్ ,ప్రేమాభిషేకం, గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలలో కూడా రుతిక నటించింది. అయితే అన్ని సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అందం , అభినయం ఉంది. గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. అయినా కూడా సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు లభించక ఇండస్ట్రీకి దూరం అయింది.. మొత్తానికి ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కేవలం ప్రతిభ ఉంటే చాలు అదృష్టం కూడా ఉండాలి. ఇక అదే అదృష్టం రుతికకు లేదని తెలుస్తోంది.

చివరకు వరల్డ్ క్లాసు డైరెక్టర్ రాజమౌళి ఛాన్స్ ఇచ్చినా కూడా ఈమెకు అదృష్టం పట్టలేదు అంటే ఆమెకు ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో కూడా నటించింది. ఐటెం సాంగ్స్ చేయడంలో కూడా వెనుకాడడం లేదు. కానీ అదృష్టం లేక చివరికి సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. మొత్తానికైతే ఇలా అవకాశాలను కోల్పోయి ఇంటిపట్టునే ఉంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news