అదితిరావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త..!

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధమంగా వినిపిస్తున్న పేరు అదితి రావు హైదరి.. మమ్ముట్టి నటించిన ప్రజా ప్రతి సినిమా ద్వారా కెరియర్ ప్రారంభించిన హైదరాబాద్ బ్యూటీ అదితి.. ఈమె ఢిల్లీ షూట్ , రాక్ స్టార్, మర్డర్ 3 వంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. శర్వానంద్ – సిద్ధార్థ కలిసి నటించిన మహాసముద్రంలో కూడా నటించింది. ఇక ఆ రోజు నుంచి ఈమె ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది.

ఈ మూవీ సమయంలో హీరో సిద్ధార్థతో ఏర్పడిన స్నేహం డేటింగ్ కు దారితీసిందని గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల హీరో శర్వానంద్ కూడా ఈ జంట మెరిసింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు బాగా వైరల్ అవుతుండగా తాజాగా అదితి రావు హైదరి పై మాజీ భర్త సత్యదీప్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశాడు. 2009లో అదితి బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రా ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరికి వారే యమునా తీరే అంటూ వ్యవహరిస్తూ వస్తున్నారు. మరొకవైపు సత్యదీప్ మిశ్రా రీసెంట్ గా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసబా గుప్తాను వివాహం చేసుకున్నాడు.

ఈ సందర్భంగా ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదితి తో నా రిలేషన్ కారణంగా ప్రేమ పై నాకు విరక్తి కలిగింది. మరొకసారి ప్రేమ పెళ్లి అంటే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్ ప్రేమ అంటే భయపడతారు. అయితే నేను ధైర్యంగా ముందడుగు వేసి కోల్పోయినవి పొందుతున్నాను అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version