ఏపీలో వచ్చే ఎన్నికలలో విజయం పైన రకరకాల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ జనసేనల పొత్తుల గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నా ఇంకా ఏ విషయం అన్నది ఇరు పార్టీల అధినేతలు ఖరారు చేయడం లేదు. తాజాగా టీడీపీ హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు. గత ఎన్నికల్లో బాలకృష్ణ ఆశీర్వదించి ఎన్నికలకు పంపించిన ఇద్దరు అల్లుళ్ళను జగన్ ఓడించారు.
ఇక వచ్చే ఎన్నికల్లోనూ బావ బావమరుదులు (చంద్రబాబు మరియు బాలకృష్ణ) జగన్ ఓడించి శాశ్వతంగా ఇంటి దగ్గరే కూర్చోపెడుతారు అంటూ కౌంటర్ ఇచ్చాడు కొడాలి నాని. మరి వైసీపీ అంచనాలను ఏపీ ప్రజలు ఎంతవరకు నెరవేర్చుతారు అన్నది చూడాలి.