ఏపీలో ఇప్పుడు వచ్చే ఎన్నికలపైనే అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఉంది. ఇక అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రజలకు దగ్గరవుతూ ఉంది. కాగా ఎమ్మెల్యే టికెట్ ల గురించి కూడా ఇక్కడ పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దీనికి తన స్టైల్ లో కొంతవరకు క్లారిటీ ఇచ్చారు. ఈయన మాట్లాడుతూ సీఎం జగన్ కు ఎవరికి టికెట్ లు ఇవ్వాలో ? ఎవరికి ఇవ్వకూడదో బాగా త్రెలుసాని చెప్పారు. అంతే కాకుండా ప్రజల్లో విశ్వాసం మరియు కార్యకర్తలలో నమ్మకం లేని ఎవరికీ టికెట్ లు ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు.
ఇక ఎమ్మెల్యే టికెట్ లు రావు అనుకునే వారు చంద్రబాబు తో టచ్ లో ఉన్నా మాకేమీ నష్టం లేదని కుండబద్దలు కొట్టారు కొడాలి నాని. మరి ఈయన చెప్పిన ప్రకారం ఈ సారి ఎమ్మెల్యే టికెట్ లు ఎవరికి వస్తాయి అన్నది ఒక క్లారిటీ అందరికీ వచ్చే అవకాశం ఉంది. ఇకనైనా ఎమ్మెల్యేలు ప్రజల వద్ద ఉంటూ వారి నమ్మకాన్ని గెలుచుకుంటే మిగిలిన ఈ కొద్దీ రోజుల్లో మంచి జరిగే అవకాశం ఉంది.