బాబు-జగన్ అదిరే వ్యూహాలు..అభ్యర్ధుల లిస్ట్ రెడీ.!

-

గతానికి భిన్నంగా ఏపీలో ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ సారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తుంటే…ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇద్దరు నేతలు తమదైన శైలిలో వ్యూహాలతో ముందుకెళుతున్నారు.  అయితే ఇద్దరు నేతలు మాత్రం గతానికి పూర్తిగా భిన్నంగా రాజకీయం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం కోసం మొహమాటం పడటం లేదు.

అంతకముందు ఎవరికైనా సీటు ఇవ్వకపోతే..వాళ్ళు ఎక్కడ అలుగుతారో అని, లేదంటే వేరే పార్టీలోకి వెళ్లిపోతారని మొహమాటంతో కాస్త సీట్లు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించే వారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. సరిగ్గా పనిచేయని నేత ఉంటే డౌట్ లేకుండా సీటు లేదని చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం వస్తే వేరే విధంగా న్యాయం చేస్తామని చెబుతున్నారు తప్ప..మొహమాటం కొద్ది సీటు ఇస్తామని అనడం లేదు. ఇటు జగన్..ఈ సారి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేనని చెప్పేస్తున్నారు.

ఒకవేళ వారు జంప్ అయిన పర్లేదు అనుకుంటున్నారు. ప్రజామోదం లేని వారికి సీటు ఇవ్వవద్దని చూస్తున్నారు. ఈ విషయంలో మొహమాటం పడటం లేదు. అదే సమయంలో ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులని రెడీ చేసేసి ప్రకటించాలని చూస్తున్నారు. అటు బాబు కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి మొహమాటంతో ఉండే పరిస్తితి కనిపించడం లేదు. కొందరు సీనియర్లకు సీటు లేదని చెప్పేశారు.

అలాగే కొందరు నేతలకు సీట్లు కూడా ఫిక్స్ చేసేశారు. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు ఆ పార్టీకి ఇవ్వాలి..అందుకే అలాంటి సీట్లని వదిలేసి..మిగిలిన సీట్లని బాబు ఫిక్స్ చేసేస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులని ప్రకటించాలని చూస్తున్నారు. మొత్తానికి ఇద్దరు నేతల వ్యూహాలు బాగానే ఉన్నాయి. మరి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news