గుండె జబ్బులు రాకూడదంటే మధ్యాహ్నం వ్యాయామం చేయాలట..!

-

వ్యాయామం చేయడానికి ఏ సమయం బెస్ట్‌ అంటే.. ఎవరైనా చెప్పేస్తారు.. ఉదయం అని.. టైమ్‌ లేకుంటే.. ఈవినింగ్‌..కానీ మార్నింగ్‌ చేస్తేనే మంచిదని నిపుణులు అనే మాటా..అస్సలు మధ్యాహ్నం వ్యాయామం చేసే థాట్‌ కూడా ఎవరికీ రాదు. ఒకవేళ చేయమన్నా చెప్పిన మనకు బుర్ర లేదనుకుంటారు.. మీకు తెలుసా.. మధ్యాహ్నం వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.. ముఖ్యంగా.. ఈరోజుల్లో విపరీతంగా పెరుగుతున్న గుండెనొప్పులు రాకుండా మధ్యాహ్నం వ్యాయామం కాపాడుతుందట.. ఇంకా ఏం ఏం బెనిఫిట్స్‌ ఉన్నాయంటే..

వ్యాయామం చేయడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం అని తాజాగా జరిగిన ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.. ఎందుకంటే ఇలా చేస్తే.. ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంది. ఈ సమయం ప్రజలు గుండెపోటు గురయ్యే అవకాశం తగ్గిస్తుందని తెలిసింది.

 

పరిశోధన ఎలా చేశారంటే..

ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాల కంటే లంచ్ సమయంలో వ్యాయామం చేయడం వల్ల అకాల మరణం నుంచి మిమ్మల్ని రక్షించవచ్చు. యూకేకు సంబంధించిన జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో దీని గురించి వివరించారు..UK బయోమెడికల్ డేటాబేస్ నుండి 92,000 మంది వ్యక్తుల ఆరోగ్యం, జనాభా డేటాను విశ్లేషించారు. అధ్యయనంలో భాగంగా ఏడు రోజుల వ్యవధిలో వారు ఎప్పుడు, ఎంత తీవ్రంగా పని చేస్తారో కొలిచే యాక్సిలరోమీటర్లు ఇచ్చారు. దీని ద్వారా మరణాల రికార్డులను పరిశీలించించారు. సుమారు 3,000 మంది పాల్గొన్నవారు మరణించారని, సుమారు 1,000 మంది గుండె జబ్బులు, 1,800 మంది క్యాన్సర్‌తో మరణించారని కనుగొన్నారు.తేలిన విషయం ఏంట్రా అంటే..

 

పరిశోధకుల బృందం కనుగొన్న ఆశ్చర్యకరమైన విషయం.. మధ్యాహ్న సమయంలో శారీరక శ్రమ చేసిన వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని గుర్తించారు. మధ్యాహ్నం వ్యాయామం చేస్తే.. ప్రజలు గుండెపోటుకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంది. దీని ద్వారా మధ్యాహ్న వ్యాయామాలు ఉదయం లేదా రాత్రిపూట వ్యాయామాల కంటే మంచిదని తేలింది. చనిపోయే అవకాశాలను తగ్గించవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. యాక్సిలరోమీటర్లు.. పాల్గొనేవారు ఎప్పుడు, ఎంత కష్టపడి పనిచేశారో ట్రాక్ చేశాయి. సాయంత్రం, ఉదయం వ్యాయామం చేసే వ్యక్తులతో పోలిస్తే, మధ్యాహ్న సమయంలో పని చేసే వ్యక్తులు గుండె జబ్బుల నుండి అంతేగాకుండా వారికి మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

మధ్యాహ్నం వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రావు, ఎక్కువ కాలం జీవించవచ్చు అంటున్నారు బానే ఉంది.. అసలు మధ్యాహ్నం ఎలా చేస్తారండీ.. టైమ్‌ ఉండొద్దా.. ఉదయం, సాయంత్రం చేయడానికి సరిగ్గా ప్లాన్‌ చేసుకోలేకపోతున్నాం.. ఇక ఆఫీసుల్లో వ్యాయామాలు చేయాలా అనే కదా మీ డౌట్.. దీనికి సొల్యూషన్‌ మీ దగ్గరే ఉంది..వ్యాయామం చేసే టైమ్‌ మీ దగ్గర లేదనే సాకుతో స్కిప్‌ చేస్తే..బయట ఆహారాలు, ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌, బిర్యానీలు ఇవి తగ్గించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది కదా.. వాటిని తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి..! నష్టం కాస్త అయినా తగ్గుతుంది అంటున్నారు వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version