నాగాలాండ్ లో BRS లో విస్తరణ.. కీలక నేతలతో కొప్పుల ఈశ్వర్ భేటీ

-

మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లోథా భేటీ అయ్యారు. నాగాలాండ్ లో బీఆర్ఎస్ స్థాపనపై చర్చ జరిపారు. డెమోక్రటిక్ లేబర్‌ పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచిన లోథా హాజరయ్యారు. నాగాలాండ్ ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై. సులంతుంగ్ హెచ్ లోథా శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో భేటీ అయ్యారు.

ఫిబ్రవరి నెలలో జరగనున్న ఎన్ని కల్లో బి.ఆర్.ఎస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోథా 1980-81 మధ్య కాలంలో కోహిమా లోథా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్,, ఆ తర్వాత ఆల్ నాగాలాండ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నారు. డెమోక్రటిక్ లేబర్‌ పార్టీ స్థాపించి 1993 సాధారణ ఎన్నికల్లో సానిస్ పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఎన్సిపి అధినేత శరద్ పవర్ స్థాపించిన పార్టీలో చేరారు.

ప్రస్తుతం నాగాలాండ్ ఎన్సిపి అధ్యక్ష బాధ్యత లతో పాటు నేషనల్ కిసాన్ సెల్ వైస్-ఛైర్మెన్ గా కొనసాగు తున్నట్లు లోథా తెలిపారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంబొత్సవానికి కూడా హాజరైనట్లు చెప్పారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ బలోపేతానికి తాము కృషి చేస్తా మని సులంతుంగ్ హెచ్ లోథా హామీ ఇచ్చారు. లోథా తో పాటు అనుదిప్, కొత్త గూడెం బిఆర్ ఎస్ స్టూడెంట్ వింగ్ నాయకులు అనుదిప్, మోర భాస్కర్ రావు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news