పాపం పాకిస్తాన్… ఆమోదించని వ్యాక్సిన్ ఇచ్చిన చైనా…!

-

పాకిస్తాన్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. బుధవారం చైనాకు చెందిన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి నెలలు గడిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చైనా ఆరోగ్య అధికారులు ఇంకా పూర్తిగా ఆమోదించని సినోఫార్మ్ వ్యాక్సిన్‌ ను పాకిస్తాన్ కి ఇచ్చారు. సుమారు 5,00,000 మోతాదులకు విరాళంగా ఇచ్చింది చైనా.

ఈ నెలాఖరులోగా మరో మిలియన్ వ్యాక్సిన్ ని అందించే అవకాశం ఉంది. 220 మిలియన్ల మంది ఉన్న పాక్ లో అర మిలియన్ కొరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సుమారు 11,000 మంది మరణించారు. కాని వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని అధికారులే అంటున్నారు. పార్లమెంటు ఆరోగ్య కమిటీకి నాయకత్వం వహిస్తున్న శాసనసభ్యుడు నౌషీన్ హమీద్ మాట్లాడుతూ మొదటి దశ టీకాలలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

సింధ్ ప్రావిన్స్ ఆరోగ్య అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వంద మంది ఆరోగ్య కార్మికులు దేశవ్యాప్తంగా మరణించారు. పల్మోనాలజిస్ట్ మరియు కోవిడ్ -19 నిపుణుడు షాజ్లీ మంజూర్ మాట్లాడుతూ, చైనా వ్యాక్సిన్ పేద పాకిస్థాన్‌కు సరిపోతుంది అని పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్లను -70 డిగ్రీల సెల్సియస్‌తో నిల్వ చేయాలని… కాని ఈ వ్యాక్సిన్ ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ (36 మరియు 46 ఫారెన్‌హీట్) మధ్య నిల్వ చేయవచ్చు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news