హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ నుంచి టికెట్లు దక్కనివారు వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన 8 మందిని ఆ పార్టీ బహిష్కరించింది.ఆరేళ్ల పాటు వారిపై బహిష్కరణ వేటు కొనసాగుతందని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ తెలిపారు.ఆ నేతల జాబితాలో మాజీ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు సందీప్ గార్గ్ (లాద్వా స్థానం), జైల్ రాం శర్మ (అసంధ్), దేవేందర్ కాదియన్ (గానౌర్), బాచన్ సింగ్ ఆర్య (సఫీదోన్), రాధా అహ్లావత్ (మేహం), నవీన్ గోయల్ (గురుగ్రామ్), కేహర్ సింగ్ రావత్ (హాథిన్) ఉన్నారు.
మాజీ మంత్రి రంజిత్.. రాణియా అసెంబ్లీ స్థానం ఇవ్వమని బీజేపీ పెద్దలను కోరగా అందుకు వారు నిరాకరించారు.దీంతో అదే స్థానం నుంచి స్వతంత్రంగా నామినేషన్ వేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో రాణియా నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు చౌతాలాకు ఉంది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇక లోక్‌సభ ఎన్నికల టైంలో రాణియా అసెంబ్లీకి రాజీనామా చేసి,హిసార్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడారు.అందుకే ఈసారి రాణియా స్థానాన్ని ఆయనకు కేటాయించేందుకు బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపలేదని సమాచారం.