ఇటీవల ఉచిత పథకాలపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత పథకాలు ఇస్తే.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింతుందని హెచ్చరించారు ప్రధాని మోడీ. అయితే తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీలంకలోని స్థితిగతులను చెప్పడానికి మంత్రి జై శంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
ఈ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మరో శ్రీలంకగా మారనున్నాయని హెచ్చరికలు జారీ చేశారు విదేశాంగ మంత్రి జై శంకర్. శ్రీలంక పరిస్థితిలో దృష్టిలో పెట్టుకొని తమ పాలన కొనసాగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కీలక సూచనలు చేశారు. తమ సూచనలు పాటించకపోతే ఆ రాష్ట్రాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.