బాబోయ్.. సముద్ర గర్భంలో గుట్టల కొద్దీ బంగారం వెలికితీత!

-

కొలంబియా అధికారులు సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. రెండు వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద బంగారం నాణేలు, ఇతర వస్తువులను వెలికితీశారు. వీటి విలువ 17 బిలియన్ డాలర్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.32 లక్షల కోట్లు ఉంటుందని సమాచారం.

పింగాణీలు
పింగాణీలు

కాగా, 1708లో స్పెయిన్ యుద్ధం జరిగిన సమయంలో కొలంబియా దేశానికి చెందిన శాన్‌జోస్ అనే భారీ నౌక బ్రిటిష్ దాడుల్లో మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 600 మంది ప్రయాణికులు ప్రయాణించారని, వారితోపాటు బంగారు ఆభరణాలు, రత్నాలు తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి నౌక గురించి తెలుసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం పరిశోధనలు చేస్తూనే ఉంది. అత్యాధునిక సాంకేతిక సాయంతో సముద్రంలో రిమోట్ కంట్రోల్ వాహనాన్ని పంపించారు. ఈ క్రమంలో రెండు శిథిల నౌకలను గుర్తించారు. బంగారు నాణేలు, పింగాణీ కప్పులు తదితర వస్తువులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news