మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకోచ్చిన ఫేస్‌బుక్‌..

-

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి ఫేస్ బుక్ ఒకటి..ప్రపంచ వ్యాప్తంగా జరిగే విషయాల గురించి తెలియచేస్తుంది.ఇప్పటికే సరికొత్త టెక్నాలజీ ఉన్న ఈ ఫేస్‌బుక్‌ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది..మీరు ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు..ఎవరూ వాటిని ఎవరెవరో మీ రిక్వెస్ట్ అంగీకరించలేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు సంబంధించి ఫేస్‌బుక్ ఎప్పుడో ఈ సెక్షన్ ప్రవేశపెట్టింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయని లిస్టు మొత్తం ఈ సెక్షన్‌లోనే చూడొచ్చు..ఈ విషయం గురించి చాలా తక్కువ తక్కువ మందికి మాత్రమే తెలుసు..

మీరు ఒక ఏడాది క్రితం ఒక వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినట్లయితే.. ఆ అభ్యర్థన ఎప్పుడు పంపారో మీకు గుర్తులేకపోయినా Facebook మీకు ఖచ్చితమైన టైమ్‌లైన్‌ను చూపుతుంది.మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆమోదించని లేదా తిరస్కరించని వ్యక్తులను మాత్రమే చూపుతుంది. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ తిరస్కరించిన యూజర్ల జాబితాను ఫేస్‌బుక్ చూపించదు. మీ అభ్యర్థనను వ్యక్తులు ఎందుకు విస్మరించారనే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. సోషల్ మీడియా సైట్‌లో యాక్టివ్‌గా ఉండకపోవచ్చు లేదా వారి అకౌంట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయి ఉండవచ్చు…మీ రిక్వెస్ట్ ను ఎవరూ అంగీకరించారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

మీ ఫేస్‌బుక్‌ ను ఇలా ఓపెన్ చెయ్యండి..

*. మూడు లైన్ల సింబల్ మెనూకి వెళ్లండి

*. మీరు ఆప్షన్ల లిస్టును చూడొచ్చు. అక్కడే మీ స్నేహితులను ఎంచుకోండి.

*. మీరు స్నేహితులను ఎంచుకున్నప్పుడు.. మీ ఫ్రెండ్ రిక్వెస్టులను పంపిన వ్యక్తుల లిస్టు మీకు చూపిస్తుంది.

*. మీరు వాటన్నింటినీ విస్మరించి.. మీ స్క్రీన్ కుడి ఎగువన ఉన్న See All ఆప్షన్ ఎంచుకోవచ్చు.

*. ఇక్కడ See All ఆప్షన్ బ్లూ కలర్‌లో హైలైట్ అయి ఉంటుంది. దీన్ని చాలా సులభంగా గుర్తించవచ్చు.

*. మీరు “See All” ఆప్షన్ ట్యాప్ చేసినప్పుడు.. మీకు వచ్చిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య కనిపిస్తుంది.

*. స్క్రీన్ కుడి పైభాగంలో మీరు సెర్చ్ బాక్స్ పక్కన త్రి డాట్స్ కనిపిస్తాయి.

*. మీరు ఆ త్రి డాట్స్ ట్యాప్ చేయగానే.. స్క్రీన్ దిగువ నుంచి పాప్-అప్ రిక్వెస్టుల ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

*. View Sent Request ఆప్షన్‌పై నొక్కండి.

*. మీ అభ్యర్థనను ఆమోదించని వ్యక్తుల లిస్టును మీరు చూడవచ్చు.

*. మీరు అభ్యర్థన పంపిన సమయాన్ని కూడా Facebook మీకు చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news