ఇటువంటి యూట్యూబ్ ఛానెల్స్ ని నమ్మద్దు: పీఐబీ ఫ్యాక్ట్ చెక్

-

తరచూ సోషల్ మీడియాలో మనకు ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూనే ఉంటుంది. ఈ నకిలీ వార్తలను నిజం అనుకుని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని కచ్చితంగా ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ నిజమైన వార్తల్ని చెబుతుంది. కనుక వార్తలు నిజమా కాదా అనేది వీటి ద్వారా మనం తెలుసుకో వచ్చు.

ఇక ఇదిలా ఉంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రభుత్వ స్కీములు కి సంబంధించి వివరాలను అందిస్తున్నారని… ఇటువంటి ఛానెల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది.

అయితే ఇలా గవర్నమెంట్ స్కీమ్ల మీద వస్తున్న నకిలీ వార్తల తో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది తప్పదు. ఫ్రాడ్స్టర్స్ నకిలీ వార్తల్ని పబ్లిష్ చేస్తున్నారని వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. అందుకని ఎప్పుడూ కూడా అనవసరంగా అన్ని వార్తల్ని నమ్మకండి. వార్తలు నిజమా కాదా అనేది తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news