ఫ్యాక్ట్ చెక్: రోడ్డు మీదే పాలని కల్తీ చేస్తున్నారు..!

-

తాజాగా నెట్టింట్లో ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఒక ట్రక్ లో రెండు పాల కంటైనర్లు తీసుకు వచ్చి ఆ పాలల్లో చేతులు పెట్టి కల్తీ చేస్తున్నారు. నిజంగా ఈ వీడియో నెట్టింట్లో తెగ షికార్లు కొడుతోంది.

ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన భారత దేశంలో చోటు చేసుకుందని రోడ్డు మీద పాల కంటైనర్ల లో పాలను కల్తీ చేస్తున్నారని ఉంది. అయితే మరి దీనిలో నిజమెంత అనే విషయం లోకి వెళితే…

ఈ వీడియో ట్విట్టర్ లో 2016 నుండి ఉంది. పైగా ఇది భారతదేశంలో జరిగిన సంఘటన కూడా కాదు. ఇది పాకిస్థాన్ లో జరిగింది. ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో వచ్చింది. ఉర్దూలో దీనికి క్యాప్షన్ పెట్టారు.

పబ్లిక్ లో పాల కంటైనర్ లో నీళ్ళు పోసి కల్తీ చేస్తున్నారు. పైగా ఆ ట్రక్ మీద శివ కార్గో లోడర్ అని ఉంది. ఇది భారతదేశంలో జరిగిన సంఘటన కానే కాదు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు చూసి నమ్మొద్దు అలానే వాటిని ఫార్వర్డ్ చేయవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version