ఫ్యాక్ట్ చెక్: పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయా..? నిజమెంత..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఇటువంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ వినపడుతోంది. ఈ క్రమంలోనే పదవ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి అని ఒక వార్త వచ్చింది.

అయితే నిజంగా పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయా..? లేదు అంటే ఇది ఫేక్ వార్త అనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకీ వచ్చిన వార్త ఏమిటి అనేదిచూస్తే… 34 ఏళ్ల తర్వాత విద్యా విధానంలో మార్పు వచ్చిందని.. ఈ విద్యా విధానం అమల్లోకి వస్తే 12వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతాయి. కనై పదో తరగతి బోర్డులన్నిటిని రద్దు చేసింది ప్రభుత్వం అని అందులో వుంది.

అలానే ఎంఫిల్ కోర్సును కూడా క్యాన్సిల్ చేసింది అని ఆ వార్తలో ఉంది. అయితే నిజానికి ఇది ఫేక్ వార్త. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాబట్టి ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో చాలా నకిలీ వార్తలు వస్తున్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి అలానే ఎవరికి కూడా షేర్ చేయొద్దు. మీరు కూడా ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version