Fact Check : పేదలందరికీ కేంద్రం రూ.32,849 ఇస్తుందా..?

-

ఇది కేవలం టెక్నాలజీ కాలం మాత్రమే కాదు.. మోసాల కాలం కూడా.. అమాయకపు ప్రజలను సైబర్‌ నేరగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి ఇలా చేయండి అంటూ వారి ఖాతాలు మొత్తం ఖాళీ చేస్తున్నారు. నిజానికి వీరికి బలయ్యేది కేవలం చదురాని వాళ్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు, లక్షల్లో జీతాలు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలందరికీ రూ.32,849ని ఇస్తుంది అనే వార్త తెగ వైరల్‌ అవుతోంది. ఈ స్కీమ్‌లో రిజిస్టర్‌ కావాలంటే ఇలా చేయండి అంటూ లింక్స్‌ పెడుతున్నారు. ఇందులో నిజమెంత ఉంది..?

ఏది నిజమో..ఏది అబద్ధామో తెలియకపోతే అకౌంట్‌లో డబ్బులు ఫసక్‌ అవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.32,849ని పేదలకి ఇస్తోందని ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. మరి నిజంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డబ్బులని అందిస్తుందా నిజం ఎంత అనేది చూస్తే… ఇది నకిలీ వార్త అని క్లారిటీ వచ్చింది.

ఈ వైర‌ల్ మెసేజ్‌పై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(PIB) క్లారిటీ ఇచ్చింది. అస‌లు ఇలాంటి ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం తీసుకురాలేద‌ని, ఈ వార్త పూర్తిగా అస‌త్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. గతంలో సైతం ఇలాంటి మెసేజులే సర్క్యూలేట్ అవ్వగా.. అప్పుడు కూడా PIB ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఏ మాత్రం నకిలీదని గుర్తు పట్టలేని విధంగా ఆ మెసేజ్ ఉంది. కేంద్ర ఆర్థికశాఖ లోగో కూడా డిట్టో దింపేశారు. అసలు ఒరిజినల్‌ ఏదో చెప్పలేనంతగా ఉంది ఆ ఫేక్ మెసేజ్.

కొందరు సైబర్‌ నేరగాళ్లు.. ఈ తరహా మోసాలుకు పాల్పడుతున్నారు. అమాయకులను ఎరగా వేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మెసేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి కాల్ చేస్తున్నామంటూ ఫోన్ చేసి డబ్బులు అడుతుంటారు. ముందుగా డబ్బులు అడిగే వ్యక్తులను అసలు నమ్మవద్దు.. నిజానికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా స్కిమ్‌ ప్రవేశ పెడితే అందరికి తెలిసేలా మెయిన్ స్ట్రీమ్‌ మీడియా న్యూస్‌లో ప్రసారం చేస్తోంది. అంతేకానీ ఇలా వాట్సప్‌లో ఫార్వడ్‌ చేస్తే మాత్రం అస్సలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news