మహారాష్ట్ర సీఎం గా ప్రమాణం చేసిన ఫడ్నవీస్

-

మహారాష్ట్ర సీఎం గా సరిత గంగాధర్ దేవేంద్ర  ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదికగా జరిగిన ఈ మహా ఘట్టం పూర్తయింది. ఫడ్నవీస్ తో గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణం చేయించారు. సీఎం పడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి గా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేయడం గమనార్హం. 

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు సీని ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ వంటి వారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి హాజరై తిలకించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version