భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రావిగూడెం లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..వరదల పట్ల ముందస్తు హెచ్చరికలు చేయక పోవడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు తీవ్ర నష్టం చవిచూశాయి అన్నారు.ఇల్లు, వాకిలి వదిలి కట్టుబట్టలతో ఉన్న నిర్వాసితులకు ప్రభుత్వం చేసిన సాయం ఏమి లేదని మండిపడ్డారు.వరద బడుతులకు తినడానికి వీలు లేని బియ్యాన్ని ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లు, పంటలు అంతా నష్టమేనని అన్నారు. సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చి పోయారు.. హామీలు ఇచ్చారు నేటి వరకు ఏ సాయము ప్రజలకు అందలేదన్నారు. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుంటే బాధితులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు.ఇల్లు, పంట, జీవనోపాధి అన్ని ఆర్ధిక నష్టాలే.. బాధిత ప్రజల గోస చెప్పలేనిదని అన్నారు. నష్టపరిహారం ప్రకటించి ఎన్ని రోజులైనా కూడా ఇప్పటివరకు వీరికి పరిహారమే అందలేదని అన్నారు. బాధితులకు పదివేలు సరిపోవని.. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.