పూర్వ కాలంలో చద్దన్నంని ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పటి కాలంలో చద్దన్నం ఎక్కువగా ఎవరు తినడం లేదు. ఇప్పటి పిల్లలు కూడా చద్దన్నం ఆ బాబోయ్…! నా వల్ల కాదు అని చెబుతారు. అదేంటి చద్దన్నం కోసం ప్రస్తావన ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా…? చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు చూస్తే మీరు కూడా మళ్ళీ మొదలెట్టేస్తారు. మరి ఇంకా ఆలస్యం చేయకండి చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు గురించి చూసేయండి.
ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో చేసిన అధ్యయనం ద్వారా వెల్లడించింది ఏమనగా… శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది, వేడి కారణంగా శరీరంలో ఉండే దుష్ఫలితాలు తగ్గుతాయి. అంతే కాదండి ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం కూడా. చద్దన్నం తినడం వల్ల స్థూలకాయులు సన్నబడొచ్చు, బక్కగా ఉన్న వాళ్ళు ఒళ్లు చేయొచ్చు. పీచుదనం పెరిగి మల బద్దకం, నీరసం కూడా తగ్గుతుంది. అలానే దీని వల్ల శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంటుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. వామ్మో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా…!
రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారిసరికే తోడన్నం తయారవుతుంది. దీని మూలంగా సన్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు. అదే లావుగా ఉన్నారనుకోండి రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. చూసారా ఎంత సులువుగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చెయ్యచ్చో. అదే విధంగా ఈ తోడన్నాన్నిగానీ, చల్లలో నానబెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినబుద్ది కాకపోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకుని తాలింపు పెట్టుకుని రుచిగా తినొచ్చు. తినేది ఏదైనా వేగంగా తినేయండి. అదే ఆలస్యం చేస్తే అది పులిసి పోతుంది.