ఫిబ్రవరి లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

-

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్న సంగతి తెలిసిందే.. కొత్త సంవత్సరం జనవరి నెల కూడా ముగిస్తుంది.. ఫిబ్రవరి నెల మరి కొద్ది రోజుల్లో రానుంది.. బ్యాంక్ సెలవులు అనేవి రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. ఒక రాష్ట్రంలో బ్యాంక్ హాలిడే ఉంటే.. మరో రాష్ట్రంలో బ్యాంక్ సెలవు ఉండకపోవచ్చు. అందువల్ల రాష్ట్రం ప్రాతిపదికన బ్యాంక్ సెలవులు మారతాయి. ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటించిన ఫిబ్రవరి సెలవుల లిస్టును ఒకసారి చూద్దాం..

banks

 

ఫిబ్రవరిలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపరిచింది. ఈ సెలవులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతాయి. ఇందులో మహాశివరాత్రి లాంటి పండుగల తో పాటు రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరి ఆ లిస్టు ఏంటో తెలుసుకుందాం..

ఫిబ్రవరి 11 – రెండో శనివారం

ఫిబ్రవరి 12 – ఆదివారం

ఫిబ్రవరి 15 – లుఇ-నగై-ని పండుగ(మణిపాల్)

ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి

ఫిబ్రవరి 19 – ఆదివారం

ఫిబ్రవరి 20 – మిజోరం రాష్ట్ర దినోత్సవం

ఫిబ్రవరి 21 – లోసార్ పండుగ

ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం

ఫిబ్రవరి 26 – ఆదివారం

బ్యాంక్ హాలిడే ఉన్నా కూడా ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి వాటి ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అందువల్ల పెద్దగా బ్యాంక్ కస్టమర్లు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. ఈరోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు ఏదైనా ముఖమైన పని ఉంటే వెంటనే చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news