హైదరాబాద్ లోనో గచ్చిబౌలి లో ఓ మహిళ సాఫ్ట్ వెర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్ వెర్ కంపెనీ లో పని చేస్తున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన కృతి సంబ్యాల్ ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతోంది. ఫ్లాట్ లో ఇద్దరి రూమ్ మేట్స్ తో కలిసి ఉంటున్న కృతి సంబ్యాల్….ఇద్దరు రూమ్ మేట్స్ రూమ్ లో లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితుడు సచిన్ కుమార్ కు మెసేజ్ పంపిన కృతి…. సచిన్ వచ్చి చూడగా ఊరికి వేలాడుతూ కనిపించింది. దీంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే కృతి మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.