కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఈరోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఆడుతున్న ఫెర్గూసన్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే, అయితే, నేడు గుజరాత్ టైటాన్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ కు జరిగిన మ్యాచ్ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు ఫెర్గుసన్. ఈ సందర్భం లోనే తను అత్యంత వేగవంతమైన డెలివరీని వేశాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 150 ప్లస్ స్పీడ్ వేసిన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఒకే ఒక్కడు అని అందరు అనుకుంటున్న తరుణం లో ఆ ఆలోచనని ఈ న్యూజిలాండ్ పేసర్ మార్చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా జమ్మూ కి చెందిన ఉమ్రాన్ మాలిక్ 152 కి.మీ వేగంతో బంతిని విసిరిన సంగతి తెలిసిందే. అయితే నేడూ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఫెర్గూసన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. గుజరాత్ తో మ్యాచ్ లో ఫెర్గూసన్ నాలుగో ఓవర్లో 154 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. ఈ బాల్ ను శుభమన్ గిల్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడి ఒక సింగిల్ తీశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డెలివరీ నమోదు చేసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు ఫెర్గుసన్. ఇక రాబోయే రోజుల్లో ఉమ్రాన్ – ఫెర్గూసన్ మధ్య మళ్లీ స్పీడ్ వార్ మొదలవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.